గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 జులై 2022 (15:46 IST)

ఆసక్తికరంగా ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ టీజర్

Aadi Saikumar, Payal Rajput
Aadi Saikumar, Payal Rajput
ఆది సాయికుమార్. ఆయన తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్‌`.  డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. `నాటకం`ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వ‌హించారు.  పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి రెండో టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఇందులో ఆది సాయి కుమార్ ఇది వరకెన్నడూ కనిపించనంత స్టైలీష్‌గా కనిపించారు. రౌడీ కాప్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లో మాస్ ఆడియెన్స్‌‌కు కిక్కిచ్చేలా ఉన్నారు. ఇక పాయల్ రాజ్‌పుత్, ఆదిల రొమాన్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చేలా ఉంది.
 
‘ఈ తీస్ మార్ ఖాన్ ఎవరు?’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది.. టీజర్ చివర్లో ‘అన్నా ప్లీజ్ అన్నా.. ఒక్క పది నిమిషాలు.. చంపను అన్నా.. జస్ట్ కాళ్లు చేతులు విరగ్గొట్టి వెళ్లిపోతా..’, ‘థ్యాంక్స్ ఫర్ గెలికింగ్ మీ.. నౌ గెట్ రెడీ ఫర్ మై గెలికింగ్’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు.