గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (14:16 IST)

విజయ్ ఆంటోని, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న వల్లి మయిల్ సినిమాకు కోటిన్నర సెట్

Vijay Antony, Faria Abdullah,  Sathyaraj
Vijay Antony, Faria Abdullah, Sathyaraj
బిచ్చగాడు, డాక్టర్ సలీమ్, విజయ రాఘవన్ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన నటిస్తున్న కొత్త సినిమా వల్లి మయిల్ తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నల్లుసామీ పిక్చర్స్ పతాకంపై థాయి శరవణనన్ నిర్మిస్తున్నారు. పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో నాయికగా నటిస్తోంది.
 
ఫస్ట్ షెడ్యూల్ లో దిండిగల్ ఏరియాను ప్రతిబింబిస్తూ 80 దశకపు వాతావరణం కనిపించేలా కోటి రూపాయలతో సెట్‌ను నిర్మించారు. ఇక్కడ ప్రధాన సన్నివేశాలు రూపకల్పన జరిపారు. ఫస్ట్ షెడ్యూల్ ఔట్ పుట్ తో చిత్రబృందం సంతోషంగా ఉంది. చెన్నై, ఢిల్లీలో తదుపరి షెడ్యూల్స్ షూటింగ్ జరపనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్స్  లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నారు.
 
సత్యరాజ్, భారతీరాజా, సునీల్, తంబి రామయ్య, రెదిన్ కింగ్స్లే జీపీ ముత్తు, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - డి ఇమాన్, సినిమాటోగ్రఫీ - విజయ్ చక్రవర్తి, ఎడిటింగ్ - ఆంటోనీ, ఆర్ట్ - ఉదయ్ కమార్, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత - థాయ్ శరవణన్, రచన దర్శకత్వం - సుసీంద్రన్.