బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (14:38 IST)

మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ వనిత సుష్మా తోడేటి

Sushma Todeti
Sushma Todeti
మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు.
 
Mrs. India competition team
Mrs. India competition team
గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా పలు కేటగిరీల్లో అవార్డులు సాధించారు. బెస్ట్ కల్చర్ డ్రెస్, మిసెస్ వెల్ స్పోకెన్, సోషల్ ఇన్‌స్టిట్యూట్ వంటి కేటగిరీల్లో టాప్‌లో నిలిచారు. రీసెంట్‌గా యూఎంబీ ప్యాజెంట్ మిసెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులోనూ సుష్మా తోడేటి తన సత్తా చాటారు. థర్డ్ రన్నరప్‌గా నిలిచారు.
 
కుటుంబమే తన బలం.. తన భర్త శ్రీనాథ్ వెన్నంటి ప్రోత్సహించడం వల్లే ఈ స్థాయిలో రాణించగలుగుతున్నానని చెబుతున్నారు సుష్మా తోడేటి. ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడం చెప్పలేని అనుభూతిని కల్గిస్తుందని అన్నారు. తెలంగాణ చేనేతను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని సుష్మా తోడేటి చెబుతుంటారు.
 
భారతదేశంలో యూఎంబీ ప్యాజెంట్ అందాల పోటీకి ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ సారి దేశం నలుమూలల నుంచి స్పూర్తిదాయకమైన 70 మంది పోటీదారులను స్వాగతించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఉర్మి, స్నిగ్ధా బారుహ్ స్థాపించిన UMB ప్యాజెంట్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, మానుషి చిల్లర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా, కరిష్మా కపూర్, మలైకా అరోరా ముఖ్య అతిథులుగా విచ్చేశారు.