క్రేజీ ప్రాజెక్ట్‌లో తెలుగింటి అమ్మాయి...

Bindu Madhavi
ప్రీతి| Last Updated: గురువారం, 25 ఏప్రియల్ 2019 (17:05 IST)
హీరోయిన్ బిందుమాధవి తెలుగు ఆడపడుచు అయినా ఎక్కువగా తమిళ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 'కళుగు' అనే తమిళ సినిమాలో ఆమె నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. అయితే ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు లేక కనుమరుగైపోయిన ఈమెకు ఓ లక్కీఛాన్స్ తలుపు తట్టిందని సమాచారం.

కోలీవుడ్‌లో పేరున్న దర్శకుడు బాలా ఎప్పుడూ వాస్తవిక సినిమాలు చేస్తుంటారు. వీటిలో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా యువ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది.

దీంతో బాలా సినిమాలో ప్రస్తుతం నటించలేనని సూర్య చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో హీరోలుగా ఆర్య, అధర్వ నటిస్తున్నారు. ఈ సినిమాలో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.దీనిపై మరింత చదవండి :