శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (12:13 IST)

హీరోయిన్లు ఇష్టంతోనే ఆ పని చేస్తున్నారు.. వారే బలవుతున్నారు.. గాయత్రి

టాలీవుడ్ నటి, ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా క్యాస్టింగ్ కౌచ్‌పై మళ్లీ స్పందించింది. శ్రీరెడ్డి కంటే ముందే కాస్టింగ్ కౌచ్‌పై గాయత్రి గుప్తా పోరాటాన్ని మొదలు పెట్టింది. అవకాశాలు ఇప్పిస్తామని తనను చాలా మంది మోసం చేశారని చెప్పి అప్పట్లో పెద్ద రాద్దాంతమే చేసేసింది. ఆ తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని కూడా ప్రయత్నాలు చేసింది. 
 
మరీ ముఖ్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు వెళ్లి మరీ బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని పోరాటం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా పోరాటం చేసింది. 
 
తాజాగా ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా మళ్లీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం తాను ఎప్పటి నుంచో చెబుతున్నాను. 
 
అయితే, చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం అవసరాల కోసం చేస్తున్నారు. వీళ్లలో అమాయకపు అమ్మాయిలే ఎక్కువగా బలి అవుతున్నారని వివరించింది.