మంగళవారం, 6 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (15:02 IST)

గదికి రమన్నాడని చెబితే చెంపదెబ్బ... చిన్మయి స్పందన

Chinmayi Sripada
నటి విచిత్ర బిగ్ బాస్ కార్యక్రమంలో 20 ఏళ్లుగా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఓపెన్‌గా మాట్లాడింది. 2001వ సంవత్సరంలో, సినిమాలోని హీరో ఆమెను గదిలోకి రానందుకు ఆమెను పక్కనబెట్టేశాడని.. ఒక వ్యక్తి తనను వేధించాడని, ఆమె స్టంట్ మాస్టర్‌కి దాని గురించి చెప్పినప్పుడు, అతను ఆమెను చెంపదెబ్బ కొట్టాడని తెలిపింది. 
 
ఈ ఘటనను పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై గాయని చిన్మయి మాట్లాడుతూ, ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు. 
 
రాజకీయ నేతలు, అబ్యూజర్లకు మద్దతు పలుకుతారు. సహాయం కావాల్సిన వారిని రక్షించే వ్యవస్థ లేనప్పుడు జరిగిన విషయాలు బయటకు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని చెప్పింది. విచిత్ర మాటలు విని  నిజంగా హృదయ విదారకంగా ఉందంటూ తెలిపింది.