గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (18:16 IST)

నా పెళ్లికి 100 మంది మాత్రమే వచ్చారు.. వరుణ్ తేజ్

lavanya - varun tej
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం గతేడాది నవంబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే దీని వెనుక ఉన్న కారణాన్ని వరుణ్ బయటపెట్టాడు. 
 
మార్చి 1న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుణ్ తేజ్ ఇటీవల మీడియాతో ముచ్చటించాడు. తన పెళ్లిని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు వరుణ్ తేజ్ వెల్లడించాడు. 
 
"సాధారణంగా పెళ్లికి వేల మంది వస్తారని, అయితే తన పెళ్లికి 100 మంది మాత్రమే వచ్చారన్నారు. నా కజిన్స్ నా పెళ్లిని నా కంటే ఎక్కువగా ఆనందించారు. మా కుటుంబం ఆనందించడమే నాకు ముఖ్యం. అందుకే అందరినీ విదేశాలకు తీసుకెళ్లాను." అంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు. లావణ్య త్రిపాఠితో ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు.