గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (19:07 IST)

ది కాశ్మీర్ ఫైల్స్ వివాదం.. ఎవరేమన్నారు..?

The Kashmir Files
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం దుమారానికి దారితీసింది. ఇది అభ్యంతరకర చిత్రమని జ్యూరీ అధినేత, ఇజ్రాయేల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. దీంతో స్పందించిన జ్యూరీ బోర్డు.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ చెప్పారు.  
 
మరోవైపు లాపిడ్ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇఫి జ్యూరీ బోర్డు మంగళవారం ఓ ప్రకటన చేసింది. లాపిడ్ చేసిన వ్యాఖ్యలకు జ్యూరీ బోర్డుకు సంబంధం లేదని స్పష్టం చేసింది.