1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (17:43 IST)

సుకుమార్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలయికలో సెన్సేషనల్ ప్రాజెక్ట్

Sukumar, Vivek Ranjan Agnihotri, Abhishek Agarwa
Sukumar, Vivek Ranjan Agnihotri, Abhishek Agarwa
ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి గడించిన తెలుగు దర్శకుడు సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో పేరు తెచ్చుకొని కాశ్మీర్ ఫైల్స్‌తో దేశవ్యాప్తంగా పాపులరైన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, కాశ్మీర్ ఫైల్స్‌ కార్తికేయ 2 వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్.. ఈ ముగ్గురు కలసి పని చేయబోతున్నారు.
 
ముగ్గురూ సమావేశమై ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి వివరాలను వారు వెల్లడించలేదు. అయితే అత్యద్భుతమైన ఈ ముగ్గురు సహకారంతో రాబోతున్న చిత్రం ఎక్సయింటింగ్ ప్రాజెక్ట్ కానుంది.
 
అభిషేక్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి కలిసి భారీ బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ అందించారు. వీరిద్దరూ కలిసి మరో రెండు ప్రాజెక్ట్స్‌లో పని చేయనున్నారు. ఈలోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.
 
“సినిమాతో ఇండియాని ఏకం చేయడం. వివరాలు త్వరలో. ఊహించండి? సుకుమార్ (దర్శకుడు, #పుష్ప) + అభిషేక్ అగర్వాల్ (నిర్మాత, #ది కాశ్మీర్ ఫైల్స్) + యువర్స్ ట్రూలీ (#TheKashmirFiles) ”అని ట్వీట్ చేసిన వివేక్ వారి సమావేశంకు సంబధించిన ఫోటోలను పంచుకున్నారు.
 
ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది పెద్ద ప్రశ్న. లెట్స్ వెయిట్ అండ్ సీ!