చిత్రపరిశ్రమ ధైర్యంగా ముందుకు రావాలి - బేంక్ లోన్‌కోసమే టిక్కట్ల అమ్మకం తెరపైకి
`నాకు పవర్‌స్టార్ అని బిరుదు ఇచ్చారు.
పవర్‌లేనిదే ఎందుకయ్యా ఇది. నేను సి.ఎం. అవుతానని రాజకీయాల్లోకి రాలేదు. అసలు నటుడు అవ్వాలనే కోరిక లేదు. కానీ అనుకోకుండా నటుడ్ని, రాజకీయ నాయకుడిని అయ్యా. ఎందుకంటే ఎన్నో వేలమంది లక్షలమంది రక్తం చిందించి గణతంత్ర దినోత్సవం తెచ్చారు. వారి ముందు మనం ఎంత? అందుకే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా. కనుకనే ఎక్కడ అవినీతి, అరాచకాలు జరుగుతున్నా ఎలుగెత్తి చాటుతున్నా. రిపబ్లిక్ సినిమాలో కూడా అదే చెబుతుంది. ఆమధ్య ఓ సన్యాసి మంత్రి వచ్చాడు. సినిమా వాళ్ళ సమస్యలు అడిగాడు. కానీ సీనీపెద్దలు సన్యాసిని బలిమలాడుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో సినిమావారంతా ఏకం కావాలి` అంటూ పవన్ కళ్యాణ్ ఎలుగెత్తి చాటారు.
సాయిధరమ్‌తేజ్ నటించిన `రిపబ్లిక్` సినిమా ప్రీరిలీజ్‌లో పవన్ మాట్లాడారు. ఒకవైపు చిత్రపరిశ్రమ సమస్యలు, మరోవైపు వై.సి.పి. పాలన తీరును ఎండగట్టారు. కోట్లు సంపాదించే హీరోలు, దర్శకుల గురించి వై.సి.పి. నాయకులు మాట్లాడుతున్నారు. కష్టపడి, గాయాలపాలై మేం సంపాదిస్తున్నాం. ఆదాయంకు తగిన టాక్స్ కడుతున్నాం. మీలా కాంట్రాక్ట్‌లు దొబ్బేసి వేలకోట్లు సంపాదించేసి టాక్స్ ఎగవేడయంలేదు అంటూ దుయ్యబట్టారు.
మోహన్‌బాబు పరిశ్రమపై స్పందించాలి - చిరంజీవి ప్రాధేయపడొద్దు
ఎ.పి.లో థియేటర్లు మూతబడ్డాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. మేం సినిమాలు తీస్తే మీరు టిక్కెట్లు అమ్ముతారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. సినిమా పరిశ్రమ జోలికి రాకండి వస్తే ఏం చేయాలో మాకు తెలుసు. ఇక మోహన్‌బాబుగారు వై.సి.పి. పార్టీకి చెందిన వ్యక్తి. పాలకులకు బంధువు కూడా. సినిమా పరిశ్రమ గురించి మీరూ అడగండి. చిరంజీవిని కూడా అడిగేలా చేయండి. చిరంజీవిగారిని ప్రాథేయపడొద్దు అని చెప్పండి. అలా చేస్తే మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కును కోల్పోయినట్లే అని ధ్వజమత్తారు.
నాన్‌లోకల్ విషయంలో ప్రకాష్‌రాజ్ గురించి ప్రస్తావన చేశారు. నటుడిగా ఆయన కావాలా? ఆయన నాకు స్నేహితుడుకాదు. వకీల్ సాబ్ సినిమా టైం సమయానికి వస్తాడా అని దిల్‌రాజును అడిగాను. వచ్చారు. చేశాం. మా సినిమా వాళ్ళ మధ్య ఏదైనా గొడవలు వుంటే అవి మా వరకే పరిమితం. నేను ప్రకాష్‌రాజ్‌కు సపోర్ట్ చేయడంలేదు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. గెలుస్తాడా? లేదా? అనేది తర్వాత సంగతి. కానీ నాన్ లోకల్ పదం కరెక్ కాదు అన్నారు.
మీడియాపై చురకలు
సాయిధరమ్‌తేజ్ బైక్ ప్రమాదానికి గురయితే స్పీడ్‌గా వెళ్ళాడు అందుకే ఇలా పడ్డాడు. అంటూ తెగ కథనాలు రాశారు. రోజుకో కథనాలు రకరకాలుగా వచ్చాయి. వారందరికీ ఒక్కటే చెబుతున్నా. మీరు రాయదలచుకుంటే వై.వివేకానందరెడ్డిని చంపింది ఎవరు? దాని గురించి ఫోకస్ చేయండి. చిన్న బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి గురించి రాయండి. నల్లమల అడవుల్లోని ఇడుపుల పాయలో నిధులు నిక్షేపాలున్నాయని పోలీసులు చెబుతుంటారు. వాటిపై ఫోకస్ పెట్టండి. కానీ పెట్టలేరు. పెడితే ఇంటికి వచ్చి కొడతారు. అందుకే నోరులేని సినిమావాళ్ళపై ప్రతాపం చూపకండి. ప్రమాదంలో ఆసుపత్రి పాలైన వ్యక్తిపై కరుణ చూపండి అంటూ పేర్కొన్నారు.
ఇలా మరెన్నో విషయాలను పవన్ కళ్యాణ్ ఏకరువు పెట్టారు. అధికారం ఉంది కదాని విర్రవీగితే చరిత్రలో ఎందరో ప్రజలచేత దండింపబడిన ఉదంతాలను పవన్ కళ్యాణ్ ముందుంచారు. ఇవన్నీ పవన్ చెబుతుంటే అభిమానులు, ఆహుతులు కరతాళధ్వనులతో హుషారెత్తించారు.