బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (18:35 IST)

వాస్తవ ఘటనలతో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్

naresh, hebba patel, viplav and others
naresh, hebba patel, viplav and others
మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. 
 
డైరెక్టర్ విప్లవ్ కోనేటి మాట్లాడుతూ..సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. నరేష్ గారు తక్కువ సీన్స్ చేసిన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ గారి క్యారెక్టర్  చూస్తే బయట ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుంది. నన్ను నమ్మండి మీరొక డిఫరెంట్ హెబ్బాను చూస్తారు ఈ సినిమాతో. హీరో రామ్ కార్తీక్ ను మిగతా వాళ్ళు తనని డామినేట్ చెయ్యకుండా, తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు. 
 
హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ... రెండు రోజుల్లో ఈ సినిమా ఆహా లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమాను చూడండి. 
 
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ,  ముందుగా మీడియాకు థాంక్స్ అండి.  ఈ సినిమా గురించి చెప్పాలి అంటే , ఈ సినిమాను ఈ జోనర్ అని ప్రత్యేకంగా చెప్పలేను. బట్ ఈ సినిమా మీకు మంచి థ్రిల్ ఇస్తుంది.