పవర్ స్టార్‌ని పెళ్లి చేసుకున్న వనితా విజయ్ కుమార్

srinivasa-vanita
డీవీ| Last Updated: గురువారం, 22 జులై 2021 (19:28 IST)
srinivasa-vanita
వనితా విజయ్ కుమార్ అంద‌రికీ తెలిసిందే. మూడుసార్లు పెళ్ళిల్లు చేసుకుని మ‌రో పెళ్లికి సిద్ధ‌మైంది. త‌న అభిరుచుల‌కు న‌చ్చిన‌వాడు దొరికాక చేసుకుంటాన‌ని అప్ప‌ట్లోనే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇలా ఏదోర‌కంగా వార్త‌లో వుండే న‌టుడు విజ‌య్ కుమార్, పెద్ద కుమార్తె వ‌నితా ఈసారి మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌ర్‌స్టార్‌తో వివాహం చేసుకున్న ఫొటోలు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే ప‌వ‌ర్‌స్టార్ అనేది త‌మిళ క‌మేడియన్‌కున్న పేరు. అత‌నే తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌.

తమిళ కమెడియన్ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్చుకొన్న ఫోటోను పోస్ట్ చేసింది. ప‌వ‌ర్ స్టార్ శ్రీ‌నివాస‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో ఫొటోల‌ను పెట్టాడు. వ‌నిత త‌మిళ సినిమాలో న‌టిస్తోంది. హీరోయిన్‌గా న‌టించిన ఆమె స్తాయి ఈ ఫొటోలతో మ‌రింత ప‌డిపోయింద‌ని నెటిజ‌న్లు కామెంట్లుచేస్తున్నారు. ఇది ఆమెకు ప్ర‌మోష‌న్‌కంటే నెగిటివ్‌కు తీసుకువ‌స్తుంద‌ని చెబుతున్నారు. గ‌తంలో ఆమె అల్లు అర్జున్ కు అత్త‌గా న‌టించాల‌నుంద‌నీ, ఎన్‌.టి.ఆర్‌.ల‌తో న‌టించాల‌నుంద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చింది. మ‌రి ఇది చూశాక అవికూడా దూర‌మ‌వుతాయేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :