గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (15:31 IST)

ఫ్యామిలీస్ తప్పనిసరిగా చూడవలసిన సినిమా రైటర్ పద్మభూషణ్‌ : మహేష్ బాబు

writer team with maheshbabu
writer team with maheshbabu
రైటర్ పద్మభూషణ్‌’ చిత్రాన్ని వీక్షించిన సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాను కంప్లీట్ గా ఎంజాయ్ చేశానని చెప్పారు. ఈ చిత్రం కథానాయకుడు సుహాస్‌, దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్‌, నిర్మాతలు శరత్‌చంద్ర, అనురాగ్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు.
 
మహేష్ బాబు మాట్లాడుతూ, “#రైటర్ పద్మభూషణ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్. ముఖ్యంగా క్లైమాక్స్! ఫ్యామిలీస్  తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది.  సినిమాలో సుహాస్ నటన నచ్చింది. ఘనవిజయం సాధించినం శరత్, అనురాగ్ రెడ్డి, షణ్ముఖ ప్రశాంత్‌ & టీమ్ అందరికీ అభినందనలు’’ తెలిపారు.
 
అలాగే సుహాస్, దర్శకుడు, నిర్మాతలతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు మహేష్ బాబు. స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత క్లిక్ చేసిన ఫోటో ఇది. ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతోంది.