గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:45 IST)

హీరో డాక్టర్ మోహన్ బాబు ఇంటిలో చోరీ.. ఎవరు చేశారంటే...

mohanbabu
సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు నివాసంలో చోరీజరిగింది. హైదరాబాద్ నగరంలోని జల్‌పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో ఈ చోరీ జరిగింది. మోహన్ బాబు హైదరాబాద్, తిరుపతిలలో ఉంటారు. అయితే, ఆయన హైదరాబాద్ వెళ్లినపుడు ఈ సువిశాలమైన స్థలంలో ఉండే ఇంటిలో ఉంటారు. ఆ ఇంట్లో కొన్నేళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ వ్యక్తే చోరీకి పాల్పడినట్టు సమాచారం. 
 
మోహన్ బాబు వద్ద అత్యంత నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ.10 లక్షలు చోరీ చేసి, ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చి చూడగా రూ.10 లక్షల నగదు కనిపించలేదు. దీనిపై పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజరు కిరణ్ తేజ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి, గణేశ్‌ను చివరకు తిరుపతిలో గుర్తించి అరెస్టు చేశారు.