శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (06:19 IST)

శాతకర్ణి సీడెడ్ మార్కెట్ రివర్స్ అయిందా? ఇదెలా?

బాలయ్య సినిమా అంటేనే సీడెడ్ మార్కెట్ అదిరిపోతుంది. ఏపీలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే బాలయ్య సినిమాకు సీడెడ్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. చిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. రాష్ట్రం మొత్తంమీద సీమప్రాంతంలో ఆడే బాలయ్య సినిమా త్వరలో ల

బాలయ్య సినిమా అంటేనే సీడెడ్ మార్కెట్ అదిరిపోతుంది. ఏపీలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే బాలయ్య సినిమాకు సీడెడ్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ ఉంటుంది. చిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. రాష్ట్రం మొత్తంమీద సీమప్రాంతంలో ఆడే బాలయ్య సినిమా త్వరలో లాభాల బాట పడుతుంది. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విషయంలో ఈ ట్రెండ్ రివర్స్ కావటం దిగ్భ్రాంతి పరుస్తోంది.
 
విశాఖపట్నం, తదితర ప్రాంతాల్లోని పట్టణ కేంద్రాల్లో శాతకర్ణి సినిమా బాగానే ఆడుతున్నా సీడెడ్ ప్రాంతంలో మాత్రం కాస్త వెనుకబడింది. కారణం ఒక్కటే. గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య మసాలా చిత్రాల వంటిది కాదు. మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా చూసే క్లాసిక్ మూవి శాతకర్ణి. 
 
అయితే సీమ ప్రాతం బయ్యర్లకు కూడా శాతకర్ణి లాభాలు ఇస్తూ సేఫ్ ప్రాజెక్టుగా అయిందని సమాచారం. అయితే బాలయ్య సినిమా రాయలసీమ ప్రాంతంలో ముందు పీఠిన కాకుండా వెనుకడుగేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం.