శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (16:26 IST)

కళాకారుడికి పాకిస్తాన్ ఇండియా తేడాలేదు : సన్నీ డియోల్

Sunny Deol
Sunny Deol
సన్నీ డియోల్ నటించిన సినిమా గదర్ 2. ఈనెల 11న విడుదలై అఖండ విజయాన్ని పొందింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించి, నిర్మించారు. శక్తిమాన్ తల్వార్ రచించారు. 2001 చలన చిత్రం గదర్: ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్, ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్,  ఉత్కర్ష్ శర్మలు మొదటి చిత్రం నుండి తమ పాత్రలను కొనసాగించారు. జీస్టుడియోన్ ఈసినిమా సౌత్ హక్కులు పొందింది. తెలుగులోనే త్యరలో డబ్ చేసి విడుదల చేయనున్నారు.
 
బుధవారం ప్రమోషన్ పని మీద  సన్నీ డియోల్ హైద్రాబాద్ వచ్చారు. కళాకారుడికి పాకిస్తాన్ ఇండియా తేడాలేదు. నేను బోర్డర్ కు వెళితే ఎందరో విష్ చేస్తారు. ఈ సినిమా దానిపై తీసింది కాదు. శక్తి మాన్ కథ నచ్చి చేశా. నా పిల్లలు కూడా ఈ సినిమా చూసి అభినందించారు.  మా ఫామిలీ ని కూడా సినిమాల్లో ఆదరిస్తున్నారు అని తెలిపారు. 
 
సౌత్ లో అందరూ బాగా కావాల్సినవారే మంచి కథ ఉంటె తెలుగులోనూ నటిస్తా. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ఆందంగా ఉంది అన్నారు. నేను నటుడిగానే ఉంటా. దర్శకుడిగా ఉండాలని ఇప్పట్లో లేదుఅని అన్నారు.