గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (15:49 IST)

తెలుగు చిత్ర పరిశ్రమకు ముద్దు బిడ్డ.. త్వరగా కోలుకోవాలి.. స్వామి నాయుడు

Megastar Chiranjeevi
తెలుగు చిత్ర పరిశ్రమకు ముద్దు బిడ్డ.. అభిమానులకు ఆరాధ్యదైవం మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడుని ప్రార్దిస్తున్నామని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ఆకాంక్షించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 45ఏళ్లుగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ అహర్నిశలూ కష్టపడుతున్నారు. 
 
ఇన్నేళ్లైనా మీలోని నటన అనే పరుగుకు అలుపుసొలుపు లేదు. అద్వితీయమైన నటన, సమ్మోహనపరిచే డ్యాన్స్, ఆసక్తి రేకెత్తించే ఫైట్స్‌తో మిమ్మల్ని మీరు మరింత పదును పెట్టుకుంటూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూనే ఉన్నారు. మా కోసం ఇంతటి కష్టాన్ని కూడా ఇష్టం చేసుకున్న మీరు.. ఇటివల మోకాలి నొప్పితో ఇబ్బందిపడటం మమ్మల్ని బాధపెట్టిన అంశం. 
 
అభిమానులు, ప్రేక్షకుల కోసం తెరపై నటనతో.. తెర బయట సేవా కార్యక్రమాలతో అందరి మనసులు నిత్యం గెలుచుకుంటూనే ఉన్నారు. మీకు కలిగిన ఈ చిన్న కష్టం కూడా మా మనసులకు కలిగిన పెద్ద గాయం. మీలాంటి మానవతా మూర్తికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటాడు. 
Chiranjeevi
Chiranjeevi
 
మీకు జరిగిన శస్త్రచికిత్స నుంచి మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ దేవ దేవుళ్లని ప్రార్ధిస్తున్నాం. మళ్లీ.. మునుపటి శక్తితో, దివ్య తేజస్సుతో, మీరు మరిన్ని సినిమాలతో వీలైనంత త్వరగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటూ.. ఎప్పటికీ మీ సేవలో పాలుపంచుకుంటాం" అని రవణం స్వామినాయుడు వ్యాఖ్యానించారు.