1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (22:19 IST)

జగన్... నిన్ను కేంద్రంతో కలిసి ఓ ఆటాడుకుంటా : పవన్ కళ్యాణ్ హెచ్చరిక

pawan kalyan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జగదాంబ సెంటర్ వేదిక నుంచి గట్టి హెచ్చరిక చేశారు. జగన్.. గుర్తుంచుకో.. కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడించకపోతే చూడు.. నీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను. అపుడు ఏం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.
 
వారాహి మూడో దశ యాత్రలోభాగంగా, ఆయన గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జగన్‌ను ఓ దోపిడీ దొంగతో పోల్చారు. మీరు ఎన్నుకున్నది దోపిడీలు చేసుకునే వ్యక్తిని. ఇలాంటి వాళ్ళను ఐదేళ్ళు బరించలేరు అని అందుకే గత ఎన్నికల్లో వైకాపాని గెలిపించవద్దని చెప్పారు. 
 
జగన్ ముఠా తెలంగాణా ప్రాంతాన్ని కూడా దోచుకుంటే అక్కడి వారు తన్ని తరిమేశారు. విశాఖలో రుషికొండను తవ్వేశారు. తుఫానుల నుంచి కాపాడే కొండను చెక్కేశారు. ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారు. వైకాపా దోపిడీని అడ్డుకోలేరా, వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి.. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి. మీ కోసం నేను నిలబడతా అంటూ ఆయన విశాఖ వాసులకు విజ్ఞప్తి చేశారు.