సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (21:50 IST)

భర్తతో అక్రమ సంబంధం.. చెల్లెలిపై ముఖంపై గన్‌తో కాల్పులు

gunshot
తన భర్తతో సోదరి అక్రమ సంబంధం నడుపుతుందనే అనుమానంతో ఢిల్లీలో ఓ మహిళ విచక్షణారహితంగా ప్రవర్తించింది. ఆమె సోదరి ముఖంపై గన్‌తో కాల్చింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లోని బులంద్ మసీదు ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
ఢిల్లీలో తన సోదరి ముఖంపై కాల్చినందుకు 30 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనుపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే... సుమైలా అనే మహిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని తన సోదరిని అనుమానంతోనే హతమార్చింది. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లోని బులంద్ మసీదు ప్రాంతంలో సోదరీమణులు నివసిస్తున్నారు.
 
బుధవారం అక్క చెల్లెలిపై పిస్టల్‌తో కాల్చింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు 30 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.