ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (20:22 IST)

చెర్రీ లాంటి భర్త దొరకడం నా అదృష్టం : ఉపాసన

Ramcharan, upasana with baby
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి భర్త దొరకడం నా అదృష్టమని ఆయన సతీమణి ఉపాసన అన్నారు. హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను గర్భందాల్చిన సమయంలో తనకు అండగా నిలిచి ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్‌ హాస్పటల్స్‌ లోగో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
 
ఇదొక ఎమోషనల్‌ జర్నీ. చిన్నారి అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో, ముఖ్యంగా ఒక తల్లి ఎంతటి ఒత్తిడికి లోనవుతుందో అర్థం చేసుకోగలను. ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతోమంది మహిళలను కలిశా. ఒంటరి మహిళల కోసం ఏదైనా సాయం చేయాలనిపించింది. అందుకే వారాంతాల్లో సింగిల్‌ మదర్స్‌ పిల్లలకు ఫ్రీ కన్సల్టేషన్‌ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. 
 
పేరెంటింగ్‌ ఎంతో ముఖ్యమైన విషయం. పిల్లల పెంపకంలో నాకెప్పుడూ సాయం చేసే భర్త ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. కానీ, సింగిల్‌ మదర్స్‌ పరిస్థితి ఏమిటి? ఎలాంటి సాయం లేకుండా వాళ్లు పిల్లలను ఎలా పెంచుతారు? అనే విషయం నన్నెంతో బాధించింది. వాళ్లకు సాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం అని ఆమె చెప్పారు.