గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ పాటలకే 90 కోట్లు ఖర్చు చేశారా?
రామ్ చరణ్ రాబోయే చిత్రం గేమ్ ఛేంజర్ భారీ అంచనాల రూపొందుతోంది. ఈ సినిమా రెండు పాటలను హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో చిత్రికరిస్తున్నారు. గత నెలలో ఈ డాన్సులో బాలీవుడ్ డాన్సర్స్ కూడా పాల్గొన్నారు. కాగా, ఈ సినిమాలోని ఐదు పాటల కోసం శంకర్ 90 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎస్ థమన్ తన కెరీర్‌లో బెస్ట్ ట్యూన్స్ అందించాడని ఇటీవలే తెలిపారు. ఆర్.ఆర్.ఆర్. తర్వాత రామ్ చరణ్ తదుపరి చిత్రం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల నుండి అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమా పాటల కోసం దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్‌ను వెచ్చించినట్లు సమాచారం.
దర్శకుడు శంకర్ ఈ సినిమాలోని ఐదు పాటల కోసం నిర్మాత దిల్ రాజు 90 కోట్ల రూపాయలను భారీ మొత్తంలో ఖర్చు చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులకు దృశ్యపరంగా గొప్ప అనుభూతిని అందించాలని చేస్తున్నారు. సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి తన కెరీర్-బెస్ట్ ట్యూన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ప్రేక్షకులు అదరగొడతారని అంటున్నారు. గ్రాండియర్ పాటలను జానీ మాస్టర్, ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. రామ్ చరణ్ డాన్స్ ఇది ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అవుతుంది.
గేమ్ ఛేంజర్ చిత్రం సమకాలీన రాజకీయాలతో కూడిన యాక్షన్ డ్రామా. ఇందులో చరణ్ ఐఎఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. వీరు 2019లో వినయ విధేయ రామలో కలిసి పనిచేశారు.