బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (18:31 IST)

కోరుట్లలో దారుణం.. బైకుపై వచ్చి కౌన్సినర్‌ మెడపై కత్తిపోట్లు

knife
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం (48)ను కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్‌లో లక్ష్మీరాజం తేనీరు సేవిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయన మెడపై ఉన్నట్టుండి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను అక్కడున్న వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.