ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (16:05 IST)

సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ స‌బ్జెక్ట్‌లో ద‌మ్ము ఉండబట్టే బ‌డ్జెట్ ఎక్కువైనా నిర్మించాం : నిర్మాత శివ ప్ర‌సాద్ ప‌న్నీరు

Producer Siva Prasad Panniru
Producer Siva Prasad Panniru
డిఫ‌రెంట్ బ్యాగ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. మాది సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. నెమ్మ‌దిగా బిజినెస్ ప్రారంభించా, 10 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉంటున్నాను. సాధారణంగా బిజినెస్ రంగానికి, సినీ రంగానికి చాలా తేడా ఉంది. ఎంటైర్ సినీ జ‌ర్నీలో క్రియేటివ్ థాట్స్‌కి, బిజినెస్‌కి చాలా తేడాలుంటాయి. వాట‌న్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్క‌డ‌కు ముందుకు పోవాల‌ని నాకు అర్థ‌మైంది. నిర్మాత‌గా ఈ జ‌ర్నీ నాకెంతో సంతోషాన్నిచ్చింది- అని నిర్మాత శివ ప్ర‌సాద్ ప‌న్నీరు అన్నారు.
 
సంతోష్ శోభ‌న్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తీసిన ఈ సినిమాకు రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు పలు విషయాలు తెలిపారు.
 
- నిర్మాతగా ప్రేమ్‌కుమార్ నా తొలి సినిమా. ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌లో మంచి ఎంట‌ర్‌టైన్మెంట్ మూవీ చేయాల‌ని అనుకున్నాను. అందువ‌ల్ల చాలా క‌థ‌లు విన్నాం. సంతోష్ కూడా ఎప్పుడు ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా చేయ‌లేదు. అందుక‌నే ఈ క‌థ‌ను సెల‌క్ట్ చేసుకున్నాం. అన్నీ పాత్ర‌ల్లో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. పెళ్లి అనేది స్క్రిప్ట్‌లో ఓ భాగం మాత్ర‌మే. సంతోష్ శోభ‌న్‌, అభిషేక్ నాకు చాలా మంచి స్నేహితులు. వారి కోసం ఈ సినిమాను స్టార్ట్ చేసిన‌ప్ప‌టికీ స‌బ్జెక్ట్‌లో ద‌మ్ము క‌నిపించింది. అందుక‌నే ముందుకు అనుకున్న బ‌డ్జెట్ కంటే క‌థ డిమాండ్ మేర‌కు కాస్త ఎక్కువ బ‌డ్జెట్ పెట్టే సినిమా చేశాం. 
 
- బేసిగ్గా నేను చాలా సాఫ్ట్ ప‌ర్స‌న్‌. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అరిచి గొడ‌వ‌ప‌డటం చేయ‌ను. ఏదైనా కూర్చుని మాట్లాడుకుంటే ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని న‌మ్ముతాను. స‌మ‌స్య మ‌న‌కు అర్థ‌మైతే ప‌రిష్కారం సుల‌భంగా తెలిసిపోతుంది. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే మా మ‌ధ్య గొడ‌వ‌లేం జ‌ర‌గ‌లేదు. క్రియేటివ్ జ‌ర్నీలో అభిప్రాయ బేదాల‌నేది సాధార‌ణంగా జ‌రుగుతుంటాయి. స్నేహితులం కాబ‌ట్టి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాం.
 
- క‌థ నాకు బాగా న‌చ్చింది. 30-35 క‌థ‌లు విన్నాం. హీరో, ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ముందుగానే ఫిక్స్ అయ్యాం. దాని మీద‌నే ఫ‌స్ట్ నుంచి వ‌ర్క‌వుట్ చేసుకుంటూ వ‌చ్చాం. చాలా విశ్లేష‌ణ‌లు త‌ర్వాత ‘ప్రేమ్ కుమార్’ క‌థ అయితే స‌రిపోతుంద‌నిపించింది. ఎందుకంటే సాధార‌ణంగా మ‌న సినిమాల్లో హీరో హీరోయిన్ పెళ్లి స‌మ‌యంలో పారిపోవ‌ట‌మే, ఫైట్ చేసి క‌లిసిపోవ‌ట‌మే జ‌రుగుతుంటుంది. అది ఎక్కువ‌గా హీరో హీరోయిన్స్ కోణంలోనే చూపిస్తూ వ‌చ్చారు. మ‌రి పెళ్లి పీట‌ల మీదున్న పెళ్లి కొడుకు పాయింట్‌ను ఎవ‌రూ చూపిచంలేదు. ఉన్నా ఏ ఒక‌ట్రెండు సినిమాల్లోనే చూసుంటారు. ఆ పాయింట్ నాకు ఆస‌క్తిక‌రంగా అనిపించింది. పెళ్లి ఆగిపోయిన‌ప్పుడు ఆ యువ‌కుడు మాన‌సికంగా ఎలాంటి బాధ‌ను అనువిస్తాడు. అత‌ని కుటుంబానికి వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏంటి? అనే దాన్ని ఎంట‌ర్‌టైన్మెంట్ యాంగిల్‌లో చూపించాం. 
 
- సంతోష్ శోభ‌న్ బ్రిలియంట్ యాక్ట‌ర్‌. త‌ను భ‌విష్య‌త్తులో చాలా పెద్ద హీరో అవుతాడు. ప్ర‌తీ న‌టుడికి ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నాకు తెలిసి ఈ ‘ప్రేమ్ కుమార్’ సినిమా త‌న బాడీ లాంగ్వేజ్‌కు సూట‌య్యే సినిమా. రేపు సినిమాను చూసిన త‌ర్వాత త‌న కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంటారు. ఇంత‌కు ముందు త‌ను చేసిన సినిమాల క‌థ‌లు త‌న చుట్టూ జ‌రిగితే .. ‘ప్రేమ్ కుమార్’ సినిమా మాత్రం సంతోష్ క్యారెక్ట‌ర్‌ను బేస్ చేసుకునే న‌డిచే క‌థ‌. సంతోష్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. మేం నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, స‌న్నిహితుల‌తో క‌లిసి సినిమా చూశాం. అంద‌రికీ సినిమా చాలా బాగా న‌చ్చింది. 
 
- స్నేహితుల కోస‌మే సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశాను.మా గ్రూపులోనే 10 -12 మంది ఉన్నారు. వారిలో డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ఉన్నారు.  అంద‌రికీ ఓ బేస్ కావాలని స్టార్ట్ చేశాం. ఈ జ‌ర్నీలో దీన్ని ఇంకా పెద్ద‌దిగా కొన‌సాగించ‌వ‌చ్చున‌నే న‌మ్మ‌కం క‌లిగింది. లాక్ డౌన్ స‌మ‌యంలో మా టీమ్‌తో క‌లిసి 40  క‌థ‌ల‌ను సిద్ధం చేశాం. అందులో 10 క‌థ‌లు బౌండెడ్ స్క్రిప్ట్స్‌తో రెడీగా ఉన్నాయి. డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీస్‌లో సినిమాలు చేయాల‌ని అనుకుంటున్నాను.