శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (19:19 IST)

ప్రేమ్ కుమార్ సినిమా ఆడియెన్స్‌ని మ‌న‌స్ఫూర్తిగా న‌వ్విస్తుంది : సంతోష్ శోభ‌న్‌

Rashi Singh, Santosh Soban
Rashi Singh, Santosh Soban
హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు .  కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Ruchitha Sadineni, Director Abhishek Maharshi, Rashi Singh, Santosh Soban, Shiva Prasad Panneeru
Ruchitha Sadineni, Director Abhishek Maharshi, Rashi Singh, Santosh Soban, Shiva Prasad Panneeru
ఈ సంద‌ర్భంగా రోల్ రైడా మాట్లాడుతూ ‘‘నాకు డైరెక్ట‌ర్ అభిషేక్ మ‌హ‌ర్షితో 2012 నుంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాలో ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ చేశాను. ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నా పాట‌కు కాస‌ర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ధ్రువ‌న్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను’’ అన్నారు.
 
ఆర్‌.ఆర్‌.ధ్రువ‌న్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా చేసే అవ‌కాశం రావ‌టానికి రోల్ రైడానే కార‌ణం. కాస‌ర్ల శ్యామ్‌గారు ఎంతో ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చారు. రాబోయే రోజుల్లో ఈ సాంగ్ అన్నీ చోట్ల వైర‌ల్ అవుతుంది’’ అన్నారు.
 
కాస‌ర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘‘నా ఫ్రెండ్స్ రోల్ రైడా, ధ్రువ‌న్ కార‌ణంగానే నేను ఈ పాట‌ను రాశాన‌ని చెప్పాలి. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ శ్రీక‌ర్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా ప‌రిచ‌యం కావ‌టం హ్యాపీగా ఉంది. శ్రీచ‌ర‌ణ పాకాలగారితో క్ష‌ణం సినిమా అసోసియేట్ అయ్యి ప‌ని చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.
 
రైట‌ర్ అనిరుద్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా క‌థ‌ను సంతోష్ ఓకే చెప్ప‌టంతోనే ప్రారంభం అయ్యింది. అభిషేక్‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. జంధ్యాల‌గారు, ఇ.వి.విగారి స్టైల్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేసేవారికి న‌చ్చే సినిమా ఇది. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంట‌న్నాను’’ అన్నారు.
 
రుచితా సాధినేని మాట్లాడుతూ ‘‘‘ప్రేమ్ కుమార్’లో అంగన అనే పాత్ర చేశాను. డబ్బున్న అమ్మాయి ఎలా ఉండ‌కూడ‌దో అలా ఉండే టైప్‌. ఆగ‌స్ట్ 18న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం. ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.
 
నిర్మాత శివ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఎంటైర్ టీమ్ అంద‌రం ఫ్రెండ్సే. అభిషేక్‌, సంతోష్ శోభ‌న్‌గారి వ‌ల్ల‌నే సారంగ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. సంతోష్ నాకు బ్ర‌ద‌ర్‌. త‌న‌ని పేరు పెట్టి పిలిచిన సంద‌ర్భాలు త‌క్కువ. డార్లింగ్ అనే పిలుస్తుంటాను. ఈ స్టోరి త‌న‌కు న‌చ్చ‌టంతో ఈ సినిమా చేయాల‌ని సంతోష్ డిసైడ్ అయ్యాడు. ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయాల‌నేదే ల‌క్ష్యంగా చేసిన సినిమా. ఆగ‌స్ట్ 18న వ‌స్తోన్న మా ‘ప్రేమ్ కుమార్’ను అంద‌రూ చూసి న‌వ్వుకుంటార‌ని భావిస్తున్నాను. అభిషేక్ డైరెక్ష‌న్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ స‌హా అంద‌రూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశారు. అభిషేక్ డేడికేష‌న్‌తో చేసిన సినిమా ఇది. ఇక‌పై ప్ర‌తీ పార్టీలో మా మూవీ సాంగ్ వినిపిస్తుంది. మూవీ చాలా బాగా వ‌చ్చింది’’ అన్నారు.
 
హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ ‘‘రోల్ రైడా, ధ్రువ‌న్ పార్టీ ధావ‌త్ సాంగ్‌ను ఓ రేంజ్ ఇచ్చారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు స‌పోర్ట్ చేసినందుకు థాంక్స్‌. ఇందులో నేత్ర అనే అమ్మాయిగా క‌నిపిస్తాను. ఆగ‌స్ట్ 18న సినిమా థియేట‌ర్స్‌లో క‌లుద్దాం. ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ అభిషేక్ మ‌హ‌ర్షి మాట్లాడుతూ ‘‘ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌.. పార్టీ ధావ‌త్ పాట‌ను విన్న ద‌గ్గ‌ర నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా? అని ఎదురు చూస్తున్నాం. ఇప్ప‌టికీ కుదిరింది. అద్భుత‌మైన పాట‌. నిర్మాత శివ ప్ర‌సాద్‌గారితో చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం. నేను స్ట్ర‌గులింగ్ యాక్ట‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి త‌ను ప‌రిచ‌యం. ఓ రోజు  సినిమా చేద్దాం అని అనుకుని ఫిక్స్ అయ్యాం. క‌థ ఫిక్స్ కావటానికి కార‌ణం సంతోష్ శోభ‌న్‌. అనంత్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. థియేట‌ర్‌లో సౌండ్ కొత్త‌గా ఉంటుంది. ఆడియెన్స్ స‌ర్‌ప్రైజ్ అవుతారు. రాశీ సింగ్‌, రుచిత ఇద్ద‌రు చ‌క్క‌గా న‌టించారు. సంతోష్ శోభన్ స్నేహితుడిగా న‌టించిన కృష్ణ తేజ అద్భుతంగా న‌టించాడు. సినిమా చూస్తున్న‌ప్పుడు మ‌న ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. బ‌య‌ట మ‌నం ఎలా ఉంటామో అదే పాత్ర‌ల‌న‌ను తెర‌పై చూస్తారు. సుద‌ర్శ‌న్ డాడీ అనే పాత్ర‌లో సూప‌ర్బ్‌గా న‌టించాడు. ఇంత వ‌ర‌కు త‌ను అలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. సుద‌ర్శ‌న్‌, అశోక్ కుమార్‌, సంతోష్ కాంబినేష‌న్ చూస్తున్నంత సేపు న‌వ్వుకుంటారు. గ్యారీ చాలా మంచి స‌పోర్ట్ ఇచ్చాడు. సినిమా బాగా రావ‌టానికి మూల కార‌ణాల్లో త‌ను ఒక‌డు. సినిమాటోగ్ర‌ఫీ రాంకీగారు మంచి విజువ‌ల్స్ అందించారు’’ అన్నారు.
 
హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ మహర్షి, శివ ప్రసాద్లకు థాంక్స్. వాళ్లు నమ్మితేనే సినిమా ఇంత వ‌ర‌కు వ‌చ్చింది. నిజానికి నా సినిమాల్లో అభిషేక్ నటించాడు. త‌ను అప్పుడు డైరెక్ట‌ర్ అవుతాడ‌ని అనుకోలేదు. ఈ సినిమా త‌ర్వాత త‌నెంత మంచి డైరెక్ట‌రో అంద‌రికీ తెలుస్తుంది. భ‌విష్య‌త్తులో హ్యూమ‌ర్‌కి అభిషేక్ ఓ బ్రాండ్ అవుతాడ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను. కామెడీ సినిమా చేయ‌టం అంత గొప్ప విష‌యం కాదు.. కానీ త‌ను గొప్ప‌గా చేశాడు. శివ నిర్మాత 50 కాదు.. 150 సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. రోల్ రైడా,  ధ్రువ‌న్‌, కాస‌ర్ల శ్యామ్ ఇచ్చిన ధావ‌త్ సాంగ్ చాలా బావుంది. అలాగే సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. రాశీసింగ్, రుచిత‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తిగారికి ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మిమ్మ‌ల్ని రెండు గంటల పాటు మ‌న‌స్ఫూర్తిగా న‌వ్విస్తుందని న‌మ్ముతున్నాను. ఆగ‌స్ట్ 18న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.