బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 ఏప్రియల్ 2024 (17:55 IST)

ఇంతటితో నా జీవితం ముగిసింది: కన్నీళ్లు పెట్టిస్తున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి చివరి పోస్ట్

Surabhi Jain
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
ఇంతటితో నా జీవితం ముగిసింది అంటూ ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి చేసిన చివరి పోస్టును చూస్తే ఎవరికైనా దుఃఖం ఆగదు. ఆమె ప్రాణాంతక వ్యాధి అండాశయ కేన్సర్‌తో పోరాడి మృత్యువు చేతిలో ఓడిపోయింది. 30 ఏళ్లకే తను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. గత కొంతకాలంగా అండాశయ కేన్సరుతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఇన్ స్టాగ్రాంలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన సురభి జైన్ నెటిజన్లతో తన అభిప్రాయాలను పంచుకుంటూ వుండేవారు. 
 
ఐతే కేన్సర్ చికిత్స తీసుకుంటూ ఆసుపత్రికి పరిమితమైపోవడంతో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. కానీ తన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇక ఇంతటితో నా జీవితం ముగిసింది అంటూ పోస్ట్ పెట్టారు. తనకు వేలల్లో సందేశాలు వస్తున్నాయనీ, కానీ తన పరిస్థితి సహకరించకపోవడంతో స్పందించలేకపోయానంటూ పేర్కొన్నారు. కాగా సురభి మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులు ఆమె అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసారు.
 
అండాశయ క్యాన్సర్ సాధారణ లక్షణాలు ఎలా వుంటాయంటే?
కడుపు ఉబ్బరం, పెల్విక్ లేదా పొత్తికడుపు నొప్పి కనబడుతుంది. తిన్న వెంటనే కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంటుంది. ఇంకా అజీర్ణం లేదా కడుపు నొప్పి, అలసట, మలబద్ధకం వంటివి కనబడతాయి. వెన్నునొప్పి, శృంగారం సమయంలో నొప్పి, ఋతుక్రమంలో మార్పులు, పొత్తికడుపు వాపు కనిపిస్తుంది. కేవలం ఈ లక్షణాలు మాత్రమే కాకుండా వివిధ ఇతర కారణాల వలన కూడా అండాశయ కేన్సర్ సంభవించవచ్చు. ఈ లక్షణాలు వుంటే తప్పనిసరిగా అండాశయ క్యాన్సర్ వచ్చిందని అనుకోకూడదు. ఈ లక్షణాలు ఏవైనా తరచుగా వస్తున్నా, పునరావృతమవుతున్న వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.