సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 జులై 2017 (17:25 IST)

సాహోలో 3 విలన్లు: రేసులో అరవింద్ సామి- ప్రభాస్‌తో నటించాలా? 2 నెలల టైమ్ కావాలన్న దేవసేన

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో అయిన ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సినిమా బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరో అయిన ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేఫ్ నటిస్తున్నాడు. మరో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నటించబోతున్నట్టు సమాచారం.
 
సాహోలో ముగ్గురు విలన్లు వుంటారని మూడో విలన్‌గా అరవింద్ సామి కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను రూ. 150 కోట్లతో తెరకెక్కిస్తున్నారు.
 
మరోవైపు సాహో సినిమాలో అనుష్క నటించట్లేదని తెలిసింది. ఇప్పటికే అనుష్క, ప్రభాస్ కాంబోలో వచ్చిన మిర్చి, బాహుబలి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాహోలో బరువు పెరగడం ద్వారానే అనుష్కను పక్కనబెట్టినట్లు సమాచారం. అయితే అనుష్కే ఈ సినిమా నుంచి తప్పుకుందని.. సాహో సినిమాలో నటించేందుకు తనకు రెండు నెలల సమయం కావాలని అప్పటి దాకా తాను డేట్స్ అడ్జస్ట్ చేయలేనని అనుష్క చెప్పినట్లు టాక్.