గురువారం, 16 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (18:53 IST)

మెన్షన్ హౌస్ మల్లేష్ గా శ్రీనాథ్ మాగంటి టైటిల్ పోస్టర్

Srinath Maganti
Srinath Maganti
శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో బాల సతీష్ దర్శకత్వం లో కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్న సినిమాకి 'మెన్షన్ హౌస్ మల్లేష్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు.  డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని లాంచ్ చేశారు.  
 
హీరో శ్రీనాథ్ మాగంటి వైట్ అండ్ వైట్ లో బ్లాక్ షేడ్స్ తో కింగ్ చైర్ లో కూర్చుని ఇంటెన్స్ గా చూస్తున్న టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ లో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి డైనమిక్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించడం క్యురియాసిటీని పెంచింది.
 
ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. అమ్మముత్తు డీవోపీ కాగా, గ్యారీ BH ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.