గురువారం, 4 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (11:06 IST)

ఇప్పుడున్న కామెడీ డబ్బా పాలులాంటివి : కోట శ్రీనివాసరావు

kota, muralimohan and ohters
kota, muralimohan and ohters
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఇటీవలే ‘జంధ్యాల హాస్య పురస్కారాల’ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులకు పలు పురస్కారాలను అందించారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. లీడర్‌ ఆఫ్‌ లాఫింగ్స్‌ పురస్కారాన్ని దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి అందుకోగా.. నటులు రఘుబాబు, అలీ, గెటప్‌ శ్రీను, సునయన మాస్టర్‌ ఆఫ్‌ స్మైల్స్‌ పురస్కారం వరించింది. నటుడు ప్రదీప్, తన ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈవెంట్‌ నిర్వహించారు.  మురళీ మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబుమోహన్, రేలంగి నరసింహారావు, పూర్ణిమ, తదితరులు మెరిశారు.
 
‘‘జంధ్యాల అందించిన హాస్యం అమ్మ పాలైతే.. ఇప్పుడున్న కామెడీ డబ్బా పాలు అన్నారు’’ నటుడు కోట శ్రీనివాసరావు. జంధ్యాల హ్యూమర్‌ సిటీ అవార్డుల వేడుకలో భాగంగా కోట శ్రీనివాసరావుకు జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారం అందించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జంధ్యాల అక్షరం తిని.. లక్షలు సంపాదించిన నటుడ్ని నేను. జంధ్యాల తర్వాత ఆ స్థాయికి తీసుకెళ్లిన మరో దర్శకుడు రేలంగి నరసింహారావు’ అని చెప్పారు. ఈ వేడుకలో దర్శకులు అనిల్‌ రావిపూడి, మారుతిలకు లీడర్స్‌ ఆఫ్‌ లాఫ్టర్‌ పురస్కారాలను, అలీ, గెటప్‌ శీను, సునయన తదితరులకు మాస్టర్‌ ఆఫ్‌ స్మైల్స్‌ అవార్డులను అందించారు. సినీ నటులు మురళీమోహన్‌, బాబూమోహన్‌, రేలంగి నరసింహారావు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలో నటుడు ప్రదీప్ మాట్లాడుతూ... నాకు జంధ్యాల గారు ఒక కన్ను అయితే.. నాకు రెండో కన్ను మా అనిల్ రావిపూడి అని వ్యాఖ్యానించాడు.
ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ... నాకు అవార్డు ఇవ్వగానే టెన్షన్ అయింది. నాకు జంధ్యాల గారి ఓ సినిమా గురించి. ష్ గప్ చుప్ అని.. అందులో దొంగల కాలేజ్ అని ఉంటుంది. ఇది నవ్వుల కాలేజ్. చాలా మంది దర్శకులు.. జంధ్యాల గారి సినిమాలు చూసి స్పూర్తి చెంది.. సినిమాలు తీస్తున్నారు. నాకు జంధ్యాల గారే స్ఫూర్తి. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూసి.. ఆయన క్యారెక్టర్స్ వేస్తూ ఉండే వాడిని. ఇప్పుడు నేను సినిమాలు తీస్తున్నాను అంటే.. కారణం ఆయనే. జంధ్యాల గారు ఓ నవ్వుల లైబ్రరీ.  అని చెప్పుకొచ్చాడు.