ముగిసిన నటుడు చలపతి రావు అంత్యక్రియలు
సినీ నటుడు చలపతిరావు అంత్యక్రియులు బుధవారం ఉదయం ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు 1200కు పైగా చిత్రాల్లో నటించిన చలపతి రావు నాలుగు రోజుల క్రితం గండెపోటుతో తన ఇంటిలోనే కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆయన ఆకస్మిక మరణంతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాద చాయలు అమలుముకున్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ సానుభూతిని తెలిపారు. అయితే, ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి హైదరాబాద్ రావడానికి ఆలస్యమైంది. దీంతో వారు వచ్చేంత వరకు పార్థివదేహాన్ని మహాప్రస్థానంలోని ఫీజర్‌లో భద్రపరిచారు. వారు నగరానికి చేరుకోవడంతో బుధవారం ఉదయం అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో పలువురు సినీ నటీనటులు పాల్గొన్నారు.