గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (09:40 IST)

ప్రియుడితో బ్రేకప్‌ వార్తలకు ఒక్క ఫోటోతో చెక్ పెట్టిన శృతిహాసన్

shruti haasan - santanu
హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. మరోవైపు, తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తలకెక్కుతున్నారు. అయితే, గత కొన్ని రోజుల క్రితం ఆమె చేసిన ఓ ట్వీట్ పెను సంచలనమైంది. 
 
తన ఒంటరితనాన్ని ఫీలవుతూ నాతో నేనే ఉంటాను. అదే నాకు సంతోషం. నా విలువైన సమయాన్ని ప్రేమిస్తాను. ఒంటరితనాన్ని ప్రేమిస్తాను అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఆమె తన ప్రియుడు సంతాను హజారికాతో బ్రేకప్ గుర్తించి వస్తున్న వార్తలు నిజమేనని ప్రతి ఒక్కరూ భావించారు. ఈ వార్తలు వైరల్ కావడంతో శృతిహాసన్ తనదైనశైలిలో స్పందించారు. 
 
కేవలం ఒకే ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు. తన ప్రియుడుతో కలిసి అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఎల్లపుడూ కోరుకునేది ఇదే అంటూ క్యాప్షన్ జోడించింది. కాగా, ప్రస్తుతం శృతిహాసన్ ఇద్దరు పెద్ద హీరోలతో నటించారు. అందులో ఒకరు చిరంజీవి. ఈయనతో "వాల్తేరు వీరయ్య" చిత్రంలో నటించారు. రెండో హీరో బాలకృష్ణ. ఈయనతో కలిసి "వీరసింహా రెడ్డి" చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదలకానున్నాయి.