మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (17:14 IST)

బాయ్‍ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్.. నెట్టింట ఫోటో వైరల్

Janvi kapoor
Janvi kapoor
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన బాయ్‍ఫ్రెండ్‌తో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన బాల్య మిత్రుడు, రూమర్డ్ బోయ్ ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో కలిసి ఉన్న ఫొటోలను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. టెన్సెల్ విల్లాలో దీపావళి వేడుకల సందర్బంగా వీరు ఈ ఫొటోలు దిగారు.
 
ప్రస్తుతం ఈ ఫోటోలపై నెట్టింట రచ్చ రచ్చ సాగుతోంది. సినిమాల్లో అతిలోకసుందరిని తలపిస్తుందని అనుకుంటే జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌ని పట్టేసిందని.. ఇక దక్షిణాదిన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రాణిస్తుందనే కలలు కల్లగా మారే ఛాన్సు లేకపోలేదని శ్రీదేవి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు తగినట్లే.. దీపావళి సెలెబ్రేషన్స్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫోజులిచ్చింది జాన్వీ. ఇక 
 
ఈ దీపావళి సెలెబ్రేషన్స్‌కు అనిల్ కపూర్, అన్షులా కపూర్, ఆకాన్ష కపూర్, సారా అలీ ఖాన్, న్యాసా దేవగణ్, తదితరులు హాజరయ్యారు. ఒక అందమైన లెహెంగా ధరించి ఈ కార్యక్రమానికి జాన్వీ హాజరైంది. 
 
మరోవైపు జాన్వీ, అక్షత్ ఇద్దరూ విడిపోయారంటూ కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ మళ్లీ కలిసిపోయారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.