గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (15:59 IST)

రికార్డులను కొల్లగొడుతున్న అల.. వైకుంఠపురములో...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురమలో. గత సంక్రాంతి పండుగకు విడుదలై ఇప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసింది. ఈ చిత్రం విడుదలై ఏడు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే వుంది. 
 
తాజాగా బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఏడు నెలల తర్వాత బుల్లితెరపై ప్రసారమై రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధించింది. ఈ చిత్రం ఏకంగా, 29.4 టీఆర్పీ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. మీ ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు అని నాగవంశీ ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ఏడు నెలలు. ఓటీటీలో రీలీజై ఆరు నెలలు. అయినప్పటికీ బుల్లితెరపై సరికొత్త టీఆర్పీతో రికార్డు సృష్టించడం గమనార్హం. ఇకపోతే, ఈ చిత్రంలోని పాటల్లో రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే.