మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (14:50 IST)

ఆర్జీవీ "పవర్ స్టార్" వీడియోకు బండ్ల గణేష్ లైక్... ప్రశ్నించిన పీకే ఫ్యాన్స్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన తాజాగా నిర్మించిన చిత్రం "పవర్ స్టార్". ఈ చిత్రం శనివారం ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ అయింది. ఇందులో పవన్‌తో పాటు ఇతర నాయకులు, దర్శకులు, నటులను పోలిన వారు న‌టించారు. 
 
అయితే గ‌త కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియోలు రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ తెస్తున్న వ‌ర్మ శుక్రవారం ప‌లు వీడియోలు రిలీజ్ చేస్తూ సినిమా జూలై 25వ తేదీన విడుద‌ల చేస్తున్నట్టు ప్రకటించాడు.
 
ఇందులోభాగంగా, ప‌వ‌న్‌ - చిరంజీవి పోలిక‌ల‌తో ఉన్న ఇద్దరు వ్య‌క్తులు మాట్లాడుకుంటున్న వీడియోని వ‌ర్మ షేర్ చేయ‌గా, దానిని ప్రముఖ సినీ నిర్మాత, పవన్ వీరాభిమానుల్లో ఒకరైన బండ్ల గ‌ణేష్ లైక్ చేశాడు. 
 
ఇది గ‌మ‌నించిన ప‌వ‌న్ అభిమాని "బండ్ల అన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేసినవ్" అని అడిగాడు. దీనికి స్పందించిన బండ్ల.. "ఒట్టు.. ఏదో పొరపాటున జరిగింది. నేనెప్పుడూ ఇలా చేయను. నేను చేసిన దానికి క్ష‌మించండి" అని బండ్ల బ‌దులిచ్చాడు. 
 
మొత్తం చేసిన పవర్ స్టార్ వీడియోకు కావాలని లైక్ కొట్టాడో లేక పొరపాటున లైక్ కొట్టాడో గానీ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం చిక్కుల్లో పడ్డారు. ఎందుకంటే టాలీవుడ్‌లో ఓ స్టార్ నిర్మాతగా బండ్ల గణేష్ ఉన్నాడంటే దానికి కారణం రియల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసు.