ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (12:25 IST)

సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

krishna
సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. శ్వాసపీల్చచడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
 
శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం బాగానే వుందని ఆయన కుమారుడు సినీ నటుడు నరేశ్ తెలిపారు. 24 గంటల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జనరల చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారని ఆయన సన్నిహితుల తెలిపారు. అందువల్ల అభిమానులెవ్వరూ ఆందోళనం చెదాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.