ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:19 IST)

సోనమ్ కపూర్ వివాహం.. స్విట్జర్లాండ్‌లో కాదు.. ఇంట్లోనే..

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ వివాహం అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఆడంబరంగా తన పెళ్లి అవసరం లేదని.. తన పెళ్లి కోసం లక్షల్లో ఖర్చు చేయదలచుకోలేదు. అంత అవసరం లేదు కూడా

ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాతో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ వివాహం అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఆడంబరంగా తన పెళ్లి అవసరం లేదని.. తన పెళ్లి కోసం లక్షల్లో ఖర్చు చేయదలచుకోలేదు. అంత అవసరం లేదు కూడా.. అవసరమైతే తన పెళ్లిని గ్రాండ్‌గా చేసుకుంటే అయ్యే ఖర్చును విరాళంగా ఇస్తాను. తనకు నచ్చినట్లుగా తన పెళ్లిని తానే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పద్ధతిగా చేసుకుంటానని సోనమ్ కపూర్ తెలిపింది. 
 
అతిలోకసుందరి శ్రీదేవి మృతికి తర్వాత... సోనమ్ కపూర్ పెళ్లి జరుగనుంది. సోనమ్ వివాహంతోనైనా విషాదంలో వున్న కపూర్ ఫ్యామీలీ కోలుకుంటుదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్ వివాహం అత్యంత వైభవంగా ముంబై లేదా స్విట్జర్లాండ్‌లో జరుగనుందని వార్తలొచ్చాయి. అయితే వార్తల్లో నిజం లేదని సోనమ్ కపూర్ స్పష్టం చేసింది. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే వివాహం చేసుకుంటానని తెలిపింది. 
 
కాగా.. యూత్ హృదయాలను కొల్లగొట్టేసిన సోనమ్ కపూర్, ఈ మధ్య ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడినట్టుగా వార్తలు షికారు చేశాయి. వీరి పెళ్లికి పెద్దలు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు.