సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 18 మే 2016 (10:36 IST)

రాంగ్‌రూట్‌లో వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదర్‌కు ఫైన్..

మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు... ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 700 రూపాయలు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే ఎన్టీఆర్‌ సోదరుడు తారక్‌కు కూడా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. ఎంతటి గొప్ప నటులైన చట్టం ముందు అందరూ సమానమేనని ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. తాజాగా ఇటువంటి సంఘటనే నోయిడాలో ఒక స్టార్ హీరోయిన్‌కు జరిగింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ హాట్ భామ అదితి రావు హైదరి నోయిడాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌లో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు వెళ్తుంది. కానీ షోకు వెళ్లడానికి తక్కువ టైం ఉండడంతో తన కార్ డ్రైవర్ షాట్ కట్ అని రాంగ్ రూట్‌లో తీసుకుని వెళ్ళుతున్నాడు. 
 
ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ ధర్మేంద్ర యాదవ్ ఆ కార్‌ని వెంబడించి పట్టుకుని ఫైన్ వేసి పేపర్ వర్క్ చేయడం మొదలు పెట్టాడు. కాగా కారులో ఉన్నది ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి అని తెలిసినా... ఏ మాత్రం పట్టించుకోకుండా తన కర్తవ్యం తాను చేసుకునిపోయాడు. 
 
ఫ్యాషన్ షోకి సమయం దగ్గర పడుతుండటంతో ట్రాఫిక్ పోలీస్‌తో ఎటువంటి గొడవ పెట్టుకోకుండా అదితి రావు కారు దిగి నడుచుకుంటూ ఆ ఎండలో షాపింగ్ మాల్‌కు వెళ్లిపోయింది.