త్రిష కెరీర్‌లోనే భిన్న కోణాలు కలిగిన చిత్రం 'నాయకి'.. 15న రిలీజ్!
ప్రముఖ నటి త్రిష టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'నాయకి'. గోవి దర్శకుడు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మ నిర్మించారు. ఈనెల 15న సినిమాను విడుదల చేస్
ప్రముఖ నటి త్రిష టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'నాయకి'. గోవి దర్శకుడు. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి, పద్మ నిర్మించారు. ఈనెల 15న సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదే విషయంపై చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాం.
తమిళంలో ముందుగా విడుదల చేయాలనుకున్నా.. సాంకేతిక కారణాలతో ఒకేసారి విడుదల చేస్తున్నాం. టీజర్‌కు స్పందన వచ్చింది. త్రిష పాడిన పాటకు విశేష ఆదరణ లభించింది. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. ఇందులో 40 నిముషాల గ్రాఫిక్స్ ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ.. హారర్ చిత్రాలలో కొత్తరకమైన చిత్రమిది. తన కెరీర్‌లో అత్యున్నత నటన త్రిష చేసింది. ఆమె పాత్రలో భిన్న కోణాలున్నాయి' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి. సంగీతం: రఘు.