గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (14:13 IST)

హీరోయిన్ త్రిషకు గాయం.. ఫారిన్ ట్రిప్ నుంచి రిటర్న్

trisha
ఒకపుడు దక్షిణాదిలో అగ్రహీరోయిన్‌గా కొనసాగిన హీరోయన్ త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "పొన్నియిన్ సెల్వన్" చిత్రం విజయంతో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు ఫారిన్ ట్రిప్‌కు బయలుదేరారు. అయితే, ఆమెకు అనుకోకుండా కాలికి గాయమైంది. దీంతో ఆమె తన ఫారిన్ ట్రిప్‌ను అర్థాంతరంగా రద్దు చేసుకుని చెన్నైకు తిరిగివచ్చారు. టూర్‌లో ఉండగా అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. దీంతో వెకేషన్ మధ్యలోనే ఇంటికి చేరుకున్నారు. 
 
ఈ క్రమంలో కాలికి పట్టి వేసివున్న ఫోటోను త్రిష ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ప్రమాదం కారణంగా వెకేషన్‌ మధ్యలోనే రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక త్రిష షేర్ చేసిన ఫోటో చూసిన ఆమె అభిమానులు, సినీ సెలెబ్రిటీలు త్వరగా కోలుకోవాలంటూ "గెట్ వెల్ సూన్" అంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.