బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (12:46 IST)

గుంటూరు కారంలో జీవితాన్ని చెప్పిన త్రివిక్రమ్, రామజోగయ్య మార్క్ మామ.. సాంగ్

Mahesh mama song
Mahesh mama song
మహేష్ బాబు,శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రలలో త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”లోని మామ ఎంతైనా పర్లేదు.. పాట నిన్న రాత్రి గుంటూరులో జరిగిన ప్రీరిలీజ్ లో విడుదల చేశారు. ఇందులో మాస్ డాన్స్ లో మహేష్ బాబు రెచ్చిపోయాడనే చెప్పాలి.
 
మిర్చి యార్డ్ లో జీవితాన్ని చదివిన మనిషిలోంచి పుట్టిన పాటగా తెరకెక్కింది. మామ ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలోదు ఏసేద్దాం ఫుల్లూ... అంటూ.. 
ఎవరికెవరు ఐనోళ్లున్నా కానీ లేరే.. వావివరస పేరు పిలుపు అన్నీ నోటి చివరే..  అంటూ జీవితాన్ని వడపోసిన కుర్రాడి నేపథ్యంలో సాగుతుంది.
రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్కు కనిపించింది. ఈ పాటను శ్రీ క్రిష్ణ, రామాచారి ఆలపించారు. థమన్ సరైన రీతిలో బాణీలు సమకూర్చారు. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా ఎంత క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.