గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (08:34 IST)

నటి తునీషా శర్మ లవ్ జిహాద్ వల్లే ప్రాణాలు తీసుకుందా?

Tunisha Sharma
బాలీవుడ్ యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 20 యేళ్లకే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. వచ్చే నెల 14వ తేదీన ఆమె తన 21వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సి వుంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె లవ్ జిహాద్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సంచలన ఆరోపణలు చేశారు.

పైగా, ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదేసమయంలో తునీషా శర్మ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఆత్మహత్య వెనుక కుట్రదారులు ఎవరు? ఏయే సంస్థలు ఉన్నాయన్న విషయాలు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. 
 
మరోవైపు, తునీషా శర్మ ఆత్మహత్య కేసులో ఆమె సహ నటుడు షీజన్ మహ్మద్‌ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. షీజన్‌ను ముంబైలోని వాసాయ్ కోర్టులో హాజరుపరచగా, ఆయనకు నాలుగు రోజుల పాటు పోలీసు కష్టడీ విధించింది.
 
కాగా, అలీ బాబా దాస్తాన్ ఈ కాబూల్ అనే టీవీ షో సెట్స్‌లో తునీషా శర్మ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. పైగా, కునీషా, షీజన్ ఖాన్‌లు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరూ రెండు వారాల క్రితమే విడిపోయారని తునీషా తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బహుశా అదే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.