గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (11:13 IST)

భర్త కోసం ఉపవాసాలు చేయని చోటే పురుషులు ఆయుఃప్రమాణాలు ఎక్కువ : ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్‌లో నటిగా.. నిర్మాతగానే కాకుండా డిజైనర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది ట్వింకిల్‌ ఖన్నా. అక్షయ్‌కుమార్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి పలికినా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. సినిమా

బాలీవుడ్‌లో నటిగా.. నిర్మాతగానే కాకుండా డిజైనర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది ట్వింకిల్‌ ఖన్నా. అక్షయ్‌కుమార్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు స్వస్తి పలికినా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. సినిమాపై మక్కువను చాటుకుంటోంది. తెరకు దూరంగా ఉన్నా ఇప్పటికీ క్రేజ్‌ తగ్గని ట్వింకిల్‌కు అభిమానుల దగ్గర్నుంచి లవ్‌ ప్రపోజల్స్‌ వస్తున్నాయి. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను ట్వింకిల్‌ నిస్సంకోచంగా వెల్లడిస్తోంది.
 
ముఖ్యంగా ఆమె చేసే వ్యంగ వ్యాఖ్యలు చాలాసార్లు వార్తల్లో నిలిచాయి. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సారి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ''ఈ మధ్యకాలంలో నలభై ఏళ్లు దాటగానే మగాళ్లు రెండో పెళ్లికి రెడీ అవుతుతున్నారు. అలాంటప్పుడు భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ వ్రతాలు ఉపవాసాలు చేయడంలో అర్థమేముంది. అయినా మగాళ్ళు అంతకాలం బతకాల్సిన అవసరం కూడా లేదు'' అంటూ ఓ ట్వీట్ చేశారు. 
 
దీనికి ఓ అభిమాని స్పందిస్తూ... ''మీకు దీని మీద నమ్మకం లేక మీరు వ్రతం చేయడం లేదు కదా.. మీ భర్తకేమన్నా అయితే అప్పుడెలా''అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ''యస్.. ఆ ఛాన్స్ వుంది. అయితే నేను వంద దేశాల్లో పురుషుల ఆయుఃప్రమాణాల గురించి రికార్డులు పరిశీలించాను. భర్త కోసం భార్యలు ఉపవాసాలు చేయని చోటే పురుషుల ఆయుఃప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి..'' అని రీట్వీట్ చేశారు.