బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2017 (14:58 IST)

మహానటి.. సావిత్రి బయోపిక్‌లో జెమిని గణేశన్‌గా ప్రకాష్ రాజ్.. జమునగా అనుష్క?

బాహుబలిలో దేవసేన పాత్రలో నటించిన యోగా టీచర్ అనుష్క.. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించనుంది. టాలీవుడ్ అగ్రనటిగా పేరు సంపాదించుకున్న అలనాటి తార సావిత్రి సినీ రంగంలో చిరస్థాయిగా మిగిలిపోయినా.. ఆమెకు వ్యక

బాహుబలిలో దేవసేన పాత్రలో నటించిన యోగా టీచర్ అనుష్క.. మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించనుంది. టాలీవుడ్ అగ్రనటిగా పేరు సంపాదించుకున్న అలనాటి తార సావిత్రి సినీ రంగంలో చిరస్థాయిగా మిగిలిపోయినా.. ఆమెకు వ్యక్తిగత జీవితంలో కష్టాలు, కన్నీళ్లు చేదు అనుభవాలే మిగిలాయి. 
 
ఈమె జీవితగాథ ప్రస్తుతం రూపొందుతోంది. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో సమంత విలేకరిగా, కీర్తి టైటిల్ రోల్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో మరో ఇద్దరు తారలు జాయిన్ అయ్యారు. వారెవరో కాదు.. అనుష్క, ప్రకాష్ రాజ్. 
 
ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన అనుష్క.. సావిత్రి సినిమాలో జమున పాత్రధారిగా కనిపించనుందని టాక్ వస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ప్రముఖ నటుడు, సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ జూన్‌ నుంచి ప్రారంభం కానుంది.