శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (12:24 IST)

ఖుషికి బ్రహ్మరథం పట్టే అమెరికన్లు.. అక్కడ కలెక్షన్ల వర్షం

Kushi 5th song
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన విజయ్ దేవరకొండ, సమంతల కుషి, పాన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామాగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా పాటలు హిట్ అయ్యాయి. 
 
తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఐటీటీ ప్లాట్‌ఫారమ్ కింగ్ నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా రివ్యూ పరంగా ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా బాగా వర్కవుట్ అయ్యాయని టాక్ వచ్చింది. 
 
దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో  పి. మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడాకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. 
 
"కుషి" యునైటెడ్ స్టేట్స్ ప్రీమియర్ షోల ద్వారా భారీగా వసూళ్లు చేసింది. మనదేశంలో కాకుండా "కుషి" యునైటెడ్ స్టేట్స్‌లో అనూహ్యంగా కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా $400k వసూలు చేసింది. ఈ రోజు ముగిసే సమయానికి ఇది హాఫ్ మిలియన్‌కు చేరుకుంటుందని అంచనా.