ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 మే 2024 (18:46 IST)

ఉస్తాద్ రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ దిమాకికిరికిరి టీజర్ రాబోతుంది

Ustad Ram Pothineni
Ustad Ram Pothineni
డబుల్ ఇంపాక్ట్ తో ఇస్మార్ట్ మ్యాడ్ నెస్ క్రియేట్ చేసే సమయం ఆసన్నమైంది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్,  ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' నుండి  దిమాకికిరికిరి అప్‌డేట్ వచ్చింది. ఈ బ్లాస్ట్  మాస్ యాక్షన్ ధమాకేధార్ ఎంటర్‌టైనర్ టీజర్‌ను మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు
 
టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌ని ఫేస్ మాస్క్‌తో పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. పులి చారల చొక్కా, టోర్న్ జీన్స్ ధరించి, ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో క్రాకర్స్ పట్టుకుని కనిపించారు రామ్ దిమాకికిరికిరి టీజర్‌ ని ప్రామిస్ చేసే పోస్టర్‌లో ఇంటెన్స్ లుక్ తో కనిపించారు.
 
ఇస్మార్ట్ శంకర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ గా వస్తున్న ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది, ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొంటుంది. త్వర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నందున, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో ముందుకు రానున్నారు.
 
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో డబుల్ యాక్షన్, డబుల్ మాస్, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోతినేని స్టైలిష్ మేకోవర్ అయ్యారు.
 
ఇస్మార్ట్ శంకర్‌తో పాటు పలు సినిమాల్లో పూరీ జగన్నాధ్‌కి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ డబుల్ ఇస్మార్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని శామ్ కె నాయుడు, జియాని జియానెలీ హ్యాండిల్ చేస్తున్నారు.
 
రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.  డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.