మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:49 IST)

నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూత

Uttej wife
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు అనారోగ్య కారణాలతో మరణించిన సంఘటనలు ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టాయి.

తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. హైదరాబాద్‏లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోజు ఉదయం 8.30 నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పడుతున్న ఆమెకు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఉత్తేజ్ భార్య మరణంపై మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్.. ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్‏ను పరామర్శించారు. పద్మావతి మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.