గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:21 IST)

పవన్ ఫ్యాన్స్ మృతుల కుటుంబాలకు 'వకీల్ సాబ్' యూనిట్ ఆర్థిక సాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్లెక్స్ క‌డుతున్న ముగ్గురు అభిమానులు విద్యుత్ ఘాతానికి గురైక‌న్నుమూశారు. ఈ ఘ‌ట‌నపట్ల పవ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయాల్సిందిగా చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. 
 
మరోవైపు, పవన్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్' చిత్ర యూనిట్‌ కూడా మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌తో పాటు గాయ‌ప‌డ్డ వారికి అండ‌గా నిలిచింది. ఈ ఘటనపై చిత్ర యూనిట్ కూడా విచారం వ్య‌క్తం చేసింది. 
 
క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలువాల‌ని తెలియ‌జేస్తూ, మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని అధికారికంగా ప్రకటించారు. 'వ‌కీల్ సాబ్' చిత్రాన్ని బోనీ క‌పూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.