1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (15:55 IST)

వెడ్డింగ్ సెలబ్రేషన్ కు ప్రముఖులను ఆహ్వానించిన వరలక్మి శరత్ కుమార్

Varalaxmi with prashant varma, raviteja
Varalaxmi with prashant varma, raviteja
నటి వరలక్మి శరత్ కుమార్ నిజజీవితంలో వధువు కాబోతుంది. 14  ఏళ్ళుగా ప్రేమించుకుంటున్న ముంబైకు చెందిన బిజినెస్ మేన్ నిక్లాయ్ సచ్‌దేవ్‌తో మార్చి 1 న ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెలాఖరు వెడ్డింగ్ సెలబ్రేషన్ ను చెన్నైలో జరగనుంది. ఇందుకు సంబంధించి పలువురు సినీప్రముఖులను ఆమె ఆహ్వానిస్తూ ఫొటోలను షేర్ చేసింది. 
 
Varalaxmi with malenene gopichand family
Varalaxmi with malenene gopichand family
వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్,  రాధిక స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. ఈ వారం వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్రసీమలోని కొంతమంది తారలను ఆహ్వానించింది. అందులో  రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, భారతీరాజా, ఏఆర్ మురుగదాస్, రవితేజ, విఘ్నేష్ శివన్, నయనతార, సిద్ధార్థ్, ప్రశాంత్ వర్మ, మురళీ శర్మ, గోపీచన్ మలినేని తదితరులను వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించింది. అలాగే  విజయ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి సమంతలను ఆహ్వానించనున్నారు.
 
Varalami with sudeep family
Varalami with sudeep family
ఇదిలా వుండగా, థాయ్ లాండ్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ వివాహం జులై 2న జరగనున్నట్లు తెలుస్తోంది.