శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 11 జూన్ 2018 (11:52 IST)

'వైర‌స్' అంటోన్న వ‌ర్మ‌... ఆఫీసర్‌ను ఫ్లాప్‌ను పట్టించుకోని వర్మ

వ‌ర్మ ఏంటి వైర‌స్ అన‌డం ఏంటి అనుకుంటున్నారా..? త‌న త‌దుప‌రి చిత్రం పేరు వైర‌స్ అని ఎనౌన్స్ చేసాడండి. నాగార్జున‌తో వ‌ర్మ తెర‌కెక్కించిన ఆఫీస‌ర్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఇక ఇప్ప‌ట్లో వ‌ర్మతో సినిమా చేయ‌డానికి ఎవ‌రు ముందుకు రారు అనుకుంటున్న త‌రుణ

వ‌ర్మ ఏంటి వైర‌స్ అన‌డం ఏంటి అనుకుంటున్నారా..? త‌న త‌దుప‌రి చిత్రం పేరు వైర‌స్ అని ఎనౌన్స్ చేసాడండి. నాగార్జున‌తో వ‌ర్మ తెర‌కెక్కించిన ఆఫీస‌ర్ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఇక ఇప్ప‌ట్లో వ‌ర్మతో సినిమా చేయ‌డానికి ఎవ‌రు ముందుకు రారు అనుకుంటున్న త‌రుణంలో వైర‌స్ త‌న నెక్ట్స్ మూవీ టైటిల్ అని ట్విట్ట‌ర్ ద్వారా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. 
 
ఇంకా ఈ సినిమా గురించి ఏమ‌న్నాడంటే... నా తర్వాత సినిమా టైటిల్ వైరస్.. సర్కార్, 26/11 సినిమాలను ప్రొడ్యూస్ చేసిన పరాఘ్ సంఘ్వీ ఈ సినిమాను నిర్మించబోతున్నారు' అంటూ స్టోరీ లైన్‌ను కూడా ముందే చెప్పేశాడు.
 
ఇంత‌కీ వైర‌స్ స్టోరీ లైన్ ఏంటంటే... 'సెంట్రల్‌ ఆఫ్రికాకు వెళ్లొచ్చిన ఓ విద్యార్థి.. ఓ భయంకరమైన వ్యాదితో బాధపడుతుంటాడు. ఆ తర్వాత అది కొంతమందికి వ్యాపించి.. అలాఅలా ముంబై మొత్తాన్ని వణికిస్తుంది. ఇలాంటి వ్యాధి గురించి ఊహించని ప్రభుత్వం.. ప్రజలంతా ఒకరి నుంచి ఒకరు 20 అడుగుల దూరంలో ఉండాలని హెచ్చరిస్తుంది. 
 
2 కోట్ల మంది ఉన్న నగరంలో అంత దూరం పెంచడం సాధ్యం కాదు. వ్యాధి విస్తరించడంతో అతి తక్కువ సమయంలోనే లక్ష మందికిపైగా ప్రాణాలు కోల్పోతారు. ప్రభుత్వం చుట్టు పక్కల ప్రాంతాలతో సంబంధాలను తాత్కాలికంగా నిలిపివేస్తుంది.
 
 ఇలా వ్యాధి నుంచి బయటపడలేక జనాలు.. కాపాడలేక ప్రభుత్వం ఎలా సతమతమయ్యింది? అన్న బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయబోతన్నాం. భయం, బాధ, ప్రేమ, త్యాగం, ఆశలను జోడించి వైరస్‌ను తెరకెక్కిస్తున్నాం అని తెలియ‌చేసారు వర్మ. ఆఫీస‌ర్ సినిమా త‌ర్వాత వ‌ర్మ సినిమా అంటే ఆడియ‌న్స్‌లో ఉన్న ఆ కాస్త ఇంట్రెస్ట్ కూడా పోయింది. మ‌రి... వైర‌స్‌లో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రో..? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో..?