1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (16:37 IST)

నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో వెంకటేష్ - దృశ్యం 2

Venkatesh -Drusham 2
వెంకటేష్ దగ్గుబాటి నటించిన తెలుగు థ్రిల్లర్ దృశ్యం 2 సినిమా నవంబర్ 25న విడుదల కాబోతోన్నట్టు అమెజాన్ వీడియో సంస్థ శుక్ర‌వారంనాడు ముంబైనుంచి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇండియాతో పాటుగా 240 దేశాల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని.. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతోంది. వెంకటేష్‌తో పాటుగా ఈ చిత్రంలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ తదితరులు నటించారు.
 
ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. కేస్ ఇన్వెస్టిగేషన్ ఎలా మలుపు తిరిగింది.. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. సీటు అంచున కూర్చోబెట్టేలా కథనం ఉంటుంది. ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా 240 దేశాల్లో విడుదల కాబోతోంది.