గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (22:09 IST)

నయనకు భారీ విలువైన బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విక్కీ

nayanatara_vignesh
39వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్‌ డే సందర్భంగా తన భర్త విఘ్నేష్‌ శివన్‌ నుంచి ఒక ప్రత్యేక బహుమతిని అందుకుంది. న‌య‌న‌తార‌ బ‌ర్త్ డేకు విఘ్నేష్ శివ‌న్ ఖ‌రీదైన మెర్సిడెజ్ బెంజ్‌ మేబ్యాక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. 
 
ఈ కారు ధ‌ర దాదాపు మూడు కోట్ల న‌ల‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుందని స‌మాచారం. విఘ్నేష్ శివ‌న్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా న‌య‌న‌తార  తాజాగా తెలియజేసింది. 
 
నయనతార, డైరక్టర్ విఘ్నేష్ శివన్ చాలా ఏళ్లుగా ప్రేమించుకున్న తర్వాత 2022 జూన్‌ 22న వివాహం చేసుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో అద్దె గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చారు.